నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని MV నగర్ లోని మైనర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారింది, ఈ కార్యాలయం పట్టణ శివారులో ఉండడంతో మందుబాబులు ఇక్కడ మద్యం సేవించి సీసాలను ఇష్ట రీతిగా పడవేస్తూ వీరంగం సృష్టిస్తున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం తలుపులు మూసివేసిన తర్వాత సాయంత్రం అవ్వగానే యదేచ్చగా ఇక్కడ మందుబాబులు మద్యం సేవిస్తున్నట్టు స్థానికులు ఆరోపించారు