సబ్సిడీపై వెదురులను అందించాలని నంద్యాల నేషనల్ హైవేను దిగ్బంధించిన శ్రీశైల నియోజకవర్గం మేదర్లు, చెంచులు,
తమకు సబ్సిడీపై వెదుర్లు అందించి ఆదుకోవాలని శ్రీశైలం నియోజకవర్గ మేదర కులస్తులు నంద్యాల రైతునగరం రోడ్డుపై సోమవారం ధర్నా చేపట్టారు. రోడ్డుపైనే వెదురు బుట్టలు, తడకలు అల్లుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. అటవీశాఖ వెదురు సరఫరా ఆపివేయడంతో జీవనోపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన మేదరులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.