కొండపి: టంగుటూరు మండలంలో 50 సంవత్సరాలకు పైగా నీడనిచ్చిన చెట్లను నరికి వేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో 50 సంవత్సరాలకు పైగా నీడనిచ్చిన చెట్లను విద్యుత్ శాఖ అధికారులు నరికి వేయడం పై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పర్యావరణ ప్రేమికుడు నరికి వేసిన చెట్లను వీడియోని తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చాడు. అనాదిగా నీడనిస్తున్న చెట్లను నరకడం వల్ల ప్రజలు నీడను కోల్పోయారని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం రోజే ఇటువంటి దృశ్యం చూడడం తమకు బాధగా అనిపించిందని సోషల్ మీడియాలో ప్రజలు అధికారుల తీరుపై అగ్రహారం వ్యక్తం చేస్తున్నారు.