స్వస్త్ నారి సశక్త్ పరివార అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
: జిల్లాకు వచ్చిన పర్యవేక్షకులు డాక్టర్ గీతా పద్మజ
మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు కోరారు. జిల్లాలో కార్యక్రమ పర్యవేక్షణకు విచ్చేసిన స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ పి. గీతాపద్మజ తో కలిసి ప్రోగ్రాం అధికారులకు ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులకు కార్యక్రమనిర్వహణపై సూచనలు చేశారు. సెప్టెంబర్17 నుండి అక్టోబర్ 2 వరకు స్వస్త నారి సశక్త్ పరివార్ అభియాన్ కింద 339 శిబిరాలు ఉంటాయన్నారు.