నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన యువకుడు మద్దిలేటి (30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ట్రాక్టర్లో నాపరాళ్ల లోడుతో ఆదోని వైపు వెళ్తుండగా ఆస్పరి సమీపంలో బినిగెరి వద్ద బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మద్దిలేటి మృతి చెందాడు. నరసింహులు, నాగార్జునకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.