అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా లేఖర్ వాడ గ్రామంలో బసవన్న కు సంప్రదాయ బద్ధంగాఅంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు
వ్యవసాయంలో 30 ఏళ్ల పాటు చేదోడువాదోడుగా నిలిచి, అనారోగ్యంతో మృతి చెందిన బసవన్న కు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. బోరజ్ మండలంలోని లేఖర్ వాడ గ్రామానికి చెందిన అరికె శ్రీకాంత్ కు సంబంధించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆదివారం డప్పు చప్పులతో సాంప్రదాయ బద్ధంగా ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్నారు.