తాడిపత్రి పట్టణంలో భక్తిశ్రద్ధలతో గురువారం గోదాదేవి ఉత్సవ విగ్రహాల ను ఊరేగింపు నిర్వహించారు. గోదాదేవి భక్తులు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని పురవీధుల గుండా ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. అనంతరం ఆలయంలో ఉంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.