నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డులో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆపి తనిఖీ చేపట్టారు.నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలు మీద కేసులు నమోదు చేశామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వప్నిల రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ప్రైవేట్ ట్రావెల్స్ ని నడపాలని సూచించారు. ఈ తనిఖీలు గురువారం సాయంత్రం ఏడు గంటలకు జరిగాయి.