తాడిపత్రి: ఎర్రగుంటపల్లిలో రైతు గంగాధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రికి తరలింపు
తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో రైతు గంగాధర్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పవర్ గ్రిడ్ అధికారులు గ్రామంలో రైతులకు తక్కువ మొత్తం చెల్లించి టవర్లు ఇష్టానుసారం ఏర్పాటు చేస్తున్నారు. డబ్బు తక్కువగా ఇచ్చారనే మనస్థాపంతో గంగాధర్ అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాడిపత్రి ఆసుపత్రికి అనంతరం అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.