కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన బేతంచెర్ల మండల రైతుల పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Dhone, Nandyal | Sep 23, 2025 సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బేతంచెర్ల మండలానికి చెందిన రైతులు మధుశేఖర్ గౌడ్, మద్దిలేటి స్వామి గౌడ్ లు కుటుంబంతో సహా బేతంచెర్ల తాసిల్దార్ తమ పొలంలో వివాదాస్పదంగా రహదారి వేస్తున్నారని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విధితమే. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ మంగళవారం బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామంలోని రైతుల మధ్య వివాదాస్పదంగా ఉన్న పొలం రహదారిని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇరువురు రైతుల సమస్యలు విన్న జిల్లా కలెక్టర్ 16 రోజుల్లోగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అంతవరకు ఎలాంటి గొడవలకు దిగొద్దని సూచించారూ