వర్ని: కోటగిరి లో రైస్ మిల్ గోడకూలి ఇద్దరు మృతి
కోటగిరి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఎస్సీ కాలనీలో ఉన్న రైస్ మిల్ గోడ కూలి మహేష్ 30 సంవత్సరాలు అతని కూతురు ఏడు రోజుల పాప అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మహేష్ భార్య మహేశ్వరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైస్ మిల్లు మూతపడి ఉంది. నిర్వహణ లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గోడ మంగళవారం పడిపోయింది.