జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో తప్పిపోయిన తీసుకురావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కుటుంబ సభ్యులు
జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలకు కూలికి వెళ్లి అక్కడ తప్పిపోయిన పాచిపెంట మండలానికి చెందిన చిన్నారావు అనే గిరిజనుడిని తీసుకురావాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పెద్ద గడ్డలో చేపలు పడుతూ నిర్వాసితుడిగా ఉన్న గిరిజనుడు కూలి పనులకు వెళ్లి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో తప్పిపోయినట్లు తెలిపారు. అక్కడి నుండి అతని తీసుకువచ్చేందుకు తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం వలన ప్రభుత్వం సహకరించాలని కోరారు.