కుప్పం: హరిజనవాడకు చెందిన పలువురు టిడిపిలో చేరిక
కుప్పం మండలంలోని గరిగెచినేపల్లెలో వైసిపికి షాక్ తగిలింది. హరిజనవాడకు చెందిన పలువురు వైసీపీకి చెందిన వారు ఆదివారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పిఎంకె వుడా చైర్మన్ సురేష్ బాబు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.