కలకడ మండలంలో ఇరిగేషన్ చెరువులను పరిశీలించిన ఎంపిడిఓ భాను ప్రసాద్
కలకడ మండలంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో పలు ఇరిగేషన్ చెరువులను ఎంపిడిఓ భాను ప్రసాద్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ భాను ప్రసాద్ మాట్లాడుతూ కలకడ మండలంలో 118 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయని,వీటిలో 15 చెరువులు 100% నీటితో నిండడం జరిగిందన్నారు. 23 చెరువులు 80శాతం నిండాయని, 25 చెరువులు 60శాతం నిండడం జరిగిందని తెలిపారు. ఈ చెరువులలో కొన్ని ఇరిగేషన్ ఏఈ స్వర్ణలత, కొన్ని చెరువులను ఎంపీడీవో భాను ప్రసాద్, పిఆర్ ఏఈ ప్రణయ్, అలాగే సంబంధిత పంచాయతీ కార్యదర్శిలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విఆర్ఎ లు కలిసి పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదన్నారు