బొంతలవారిపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
గ్రామస్తుల కథనం మేరకు కలకడ మండలం కదిరాయచెరువు పంచాయతీ ఎస్టి కాలనీకి చెందిన పెద్ద రెడ్డప్ప భార్య 64సం. శెట్టిపల్లి జయమ్మ తమ ఇంటి నుంచి బొంతల వారి పల్లి వద్ద గల పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా కదిరాయ చెరువు వైపు నుంచి గుర్తు తెలియని బొలెరో పికప్ వాహనం అతివేగంగా వచ్చి జయమ్మ ను డీకొని ఆపకుండా వెళ్లిపోయిందని తెలిపారు. వృద్ధురాలు రోడ్డు పై పడి తల వెనుక వైపున బలమైన రక్త గాయం కావడంతో పాటు చెవులు మరియు ముక్కులో నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి తీవ్రంగా గాయపడగా స్థానికులు108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.