పంపులు హెడ్ వర్క్ వద్ద పరిసరాలను స్వయంగా శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
Eluru Urban, Eluru | Sep 25, 2025
ఏలూరులోని పంపుల హెడ్ వాటరు వర్క్స్ వద్ద “స్వచ్ఛతా హి సేవ - 2025” భాగంగా “ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్” అనే థీమ్‌తో ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ యండి బి.అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంయుక్తంగా మొక్కలు నాటి, చెత్తచెదారం వేరివేసి ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ యండి బి.అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న “స్వచ్ఛతా హి సేవ - 2025” కార్యక్రమంలో భాగంగా “ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్” అనే థీమ్‌తో పంపుల హెడ్ వాటరు వర్క్స్ లో అందరుకలిసి ప్రత్యేక శుభ్రం చేశారు.