కాటారం: కాటారంలో ఘనంగా సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ పదవి విరమణ సన్మానం
58 బెటాలియన్ కాటారం క్యాంప్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ ఏఎస్సై సురేష్‌కుమార్‌కు గురువారం పదవీ విరమణ సన్మానకార్యక్రమం ఘనంగా జరిగింది. కేరళ రాష్ట్రానికి చెందిన సురేష్‌కుమార్ 1996లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా నియమితులై ప్రస్తుతం ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా స్వచ్చంధ పదవీ విరమణ చేశారు. సుమారు 28ఏళ్ల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన సురేష్‌కుమార్‌ను సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, తోటి జవాన్లు శాలువాతో సత్కరించి అనంతరం బహుమతులందించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.