నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుమ్మరి నాగన్న (58) చికిత్స పొందుతూ కోలుకోలేక కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మృతి చెందాడు,బంధువులు తెలిపిన వివరాల మేరకు ముసలిమడుగు సమీపంలో సోమవారం సాయంత్రం రెండు ద్వి చక్రవాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయాపడిన ఎదురుపాడు కుమ్మరినాగన్న కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు, మంగళవారం మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు కొత్తపల్లి ఎస్సై జయశేఖర్ తెలిపారు.