పిఠాపురం యూరియా మాఫియా బయటపడింది మాజీ ఎంపీ పిఠాపురం వైసిపి ఇంచార్జ్ వంగా గీత విశ్వనాథ్.
పిఠాపురంలో రైతులకు చేరాల్సిన యూరియా పక్కదారి పడుతుందని మాజీ ఎంపీ పిఠాపురం వైసిపి ఇన్చార్జ్ వంగా గీత అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం వైసిపి కార్యాలయంలో గురువారం సాయంకాలం నాలుగు గంటలకు మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడారు. తాడిపర్తిలో అక్రమంగా లారీలో తరలిస్తున్న యూరియా బస్తాలను విజిలెన్స్ అధికారుల జప్తుతో మాఫియా బయటపడిందన్నారు. పిఠాపురానికి వచ్చిన సరకును పక్కదారి పట్టించి, వారి స్వలాభాలకు ఉంచుకొని మిగిలిన యూరియాను రైతులకు అందజేస్తున్నారని ఆరోపించారు. ఇలా సాగుదారుల నోట మట్టికొట్టడం సరికాదన్నారు.