పలమనేరు: శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కార్యవర్గ సభ్యులు మరియు ఎండోమెంట్ అధికారులు సోమవారం మీడియా తెలిపిన సమాచారం మేరకు. ప్రఖ్యాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు గత నాలుగు నెలల్లో భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలు లెక్కింపు చేయడం జరిగింది. నగదు మూడు లక్షల 596 రూపాయలు, నాణ్యాలు నోట్లు ద్వారా లభించింది. ఏడు గ్రాముల బంగారం మరియు 162 గ్రాముల వెండి భక్తులు సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో కమలాకర్, ఎండోమెంట్ అధికారులు మరియు ఆలయ చైర్మన్ మురళి కార్యవర్గ సభ్యులు అర్చకులు పాల్గొన్నారు.