సంతనూతలపాడు మండలం మైనంపాడు హైస్కూల్లో సోమవారం జరుగుతున్న ఆధార్ ప్రత్యేక క్యాంపును డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆధార్ విద్యార్థులకు డిప్యూటీ ఎంపీడీవో పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం హనుమాచారి, మైనంపాడు పంచాయతీ అభివృద్ధి అధికారి ఆవులయ్య తదితరులు పాల్గొన్నారు.