కొండపి: రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే పిపిపి విధానం : ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుందంటూ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం టంగుటూరు మండలం తూర్పు రాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ అడిగిన వెంటనే సీఎం విడుదల చేస్తున్నారని అలానే పిపిపి విధానం పై మంత్రి స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అనవసరంగా బురద చల్లుతుందని అన్నారు.