పులివెందుల: పులివెందుల APTWR పాఠశాలలో MLC భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
పులివెందుల పట్టణంలోని APTWR (ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్) బాయ్స్ స్కూల్ ను శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంక్షేమం, ఆహార నాణ్యత, వసతి గృహాల పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ తనిఖీ చేపట్టారు. తనిఖీ సందర్భంగా ఎమ్మెల్సీ వంటగది, భోజనశాల, తరగతి గదులు, వసతి గృహాలు మరియు బాత్రూములను పూర్తిగా పరిశీలించారు. విద్యార్థుల గదుల్లోకి బాత్రూం నీరు ప్రవహిస్తుండటం గమనించిన ప్రిన్సిపల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.