ఆలూరు: ఆలూరు మండలం రీ సర్వే, గ్రామసభ అవగాహన సదస్సులో టీడీపీ ఆలూరు ఇంచార్జ్ జ్యోతి
Alur, Kurnool | Oct 7, 2025 ఆలూరు మండలం అరికెరలో రీ సర్వే, గ్రామసభఅవగాహన సదస్సులో టీడీపీ ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని, గ్రామస్థులకు రీసర్వే ప్రాముఖ్యత, పంచాయతీ వ్యవహారాల అవగాహన, సమస్యల పరిష్కార మార్గాలను వివరించారు. స్థానికులు పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు వెల్లడించారు. సదస్సు ద్వారా గ్రామ ప్రజల్లో ప్రభుత్వ విధానాలపై అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.