జగిత్యాల: ఈనెల 15వ తారీఖున ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయండి-జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఆదివారం సాయంత్రం 4 గంటలకు జగిత్యాల జిల్లా మల్యాల మండల్ ముత్యంపేట్ ఎమ్మార్పీఎస్ విహెచ్ వికలాంగుల, బీడీ కార్మికుల మండల్ కో కన్వినర్ గుడిసె రవి అధ్యక్షతన ఏర్పాటు సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిలదీయడానికి ఈనెల 1