తాడికొండ: గుంటూరు: ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరు: ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న పోలీసులు గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లిపర మండలం అన్నవరపు లంక పరిసర ప్రాంతాల్లోని ఇసుక రీచ్లలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఉన్నతాధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఆయా ఇసుక రీచ్లను తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలు లారీలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.