అసిఫాబాద్: కొమురం భీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
ఆసిఫాబాద్ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొమురం భీం ప్రాజెక్టు లోకి 2,021క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు బుధవారం మధ్యాహ్నం అప్రమత్తమై 2గేట్లను 0.5మీటర్ల మేర ఎత్తి 2,021క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. మిషన్ భగీరథ కోసం 34 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు.