పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా యువతకు నైపుణ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నాం: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Mar 28, 2026
పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా యువతకు నైపుణ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఈ దిశగా తమతో కలసి రావాలని ఆయన కోరారు. బీపీసీఎల్, ఇండో సోల్, జె.ఎస్.డబ్ల్యు కంపెనీలు, సెంచూరియన్ యూనివర్సిటీ అధికారులు, జిల్లాలోని మైన్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో శనివారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో పాటు మరిన్ని కొత్తవి త్వరలో కార్యరూపం దాల్చబోతున్నందున స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అదే సమయంలో పరిశ్రమల అవసరాలకు యువతన సిద్ధం చేయడం జరుగుతుందన్నారు