నల్గొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గాయత్రి దేవిని దర్శనం ఇచ్చిన అమ్మవారు
నల్గొండ జిల్లా: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు మంగళవారం అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.గాయత్రి దేవుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ సకల జ్ఞానం ఉపవాసన బుద్ధి తేజోవంతం అవుతుందని పండితులు తెలుపుతారు.అలాగే దసరా పండుగ వేళ ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే సకల ఉప్పద్రవాలు పటాపంచలై జీవితములో సుఖసంతులు చేకూరుతాయని భక్తులు నమ్మకంతో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు.