పూతలపట్టు: చిత్తూరులో కారు అడ్డు రావడంతో ఢీకొని ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా తప్పిన భారీ ప్రమాదం
బంగారు పాల్యం మండలంలోని మహాసముద్రం టోల్ ప్లాజా సంక్రాంతి పల్లి సమీపంలో ఆదివారం 12 గంటల ప్రాంతంలో చిత్తూరు నుండి పలమనేరు వైపు వెళ్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోలు, డీజిల్, లోడుతో వెళ్తున్న ట్యాంకర్ పలమనేరు వైపు నుంచి అతివేగంగా కారు డివైడర్ పై ఎక్కి అడ్డు రావడంతో ట్యాంకర్ ఢీకొని ట్యాంకర్ బోల్తా కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు. అయితే ట్యాంకర్ లో పెట్రోల్ మరియు డీజిల్ రెండు రోడ్డుపైన పడిపోవడంతో ఏమాత్రం ఫైర్ అయిన వున్న సంక్రాంతి పల్లి గ్రామంలో ఒక ఇల్లు కూడా మిగిలేది కాదని ప్రజలు పండగ పూట పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు.