రాట్నాలకుంట శ్రీరాట్నాలమ్మఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మల్లికార్జునరావు
Eluru Urban, Eluru | Sep 27, 2025
ఏపీ స్టేట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ మల్లికార్జున్ రావు దంపతులు శనివారం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులను ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటాన్ని న్యాయమూర్తి దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.