ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో కోదండ రామస్వామి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. మంగళవారం రాత్రి స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారికి కాయ కర్పూరం నైవేద్యాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.