ఆలూరు: ఆలూరులో యువకుడి అనుమానస్పద మృతి, కేసు దర్యాప్తు చేస్తున్న ఆలూరు పోలీసులు
Alur, Kurnool | Oct 8, 2025 ఆలూరులో యువకుడి అనుమానాస్పద మృతి ఆలూరులో గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైంది. స్థానిక గుంతకల్లు రహదారిలోని జగనన్న కాలనీ సమీపంలో సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడి మృతదేహం బోర్ల పడి ఉంది. స్థానికులు గమనించి ఆలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఆత్మహత్యకు పడ్డాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.