అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని నార్పల మండల కేంద్రంలో తల్లి కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.