ఇబ్రహీంపట్నం: బండ్లగూడ లో విషాదం, పీఠం చెరువులో పడి అమ్మమ్మ మనవరాలు మృతి, ప్రాణాలు దక్కించుకున్న మరో మనవరాలు
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడలోని చెరువులో స్థానికంగా నివాసం ఉండే యూసీబీ తన ఇద్దరు మనవరాలతో కలిసి బట్టలు ఉతికెందుకు వెళ్ళింది. ఈ క్రమంలో అమ్మమ్మ జారీ చెరువులో పడగా అమ్మమ్మను కాపాడేందుకు ఇద్దరు మనవరాలు చెరువులో దూకారు. అమ్మమ్మ మనవరాలు మృతిచెందగా మరో మనవరాలు చెట్టుకొమ్మను పట్టుకొని ప్రాణం దక్కించుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.