పర్యావరణను పరిరక్షిద్దాం : కమీషనర్ నందన్
స్వచ్చాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 28 డివిజన్లలో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు .గ్రీన్ ఆంధ్ర సాధనలో భాగంగా ప్రతీ డివిజన్ లో మొక్కలు నాటారు. ప్రతీనెల మూడో శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వచ్చాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ ఏ.సీ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పాల్గొన్నారు స్థానిక ప్రజలందరితో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం కమిషనర్ నందన్ స్వచ్ఛత ప్రతిజ్ఞ శనివారం ఉదయం 11 గంటలకు చేయించారు.