చెర్లోపల్లి లో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు
నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లెలో శ్రీ గణపతి, శ్రీ ఉమా భోగ మల్లేశ్వర, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ, శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమాన్, నవగ్రహ, ధ్వజ, శిఖర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, బీసీ ఇందిరా రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి దంపతులకు భక్తులు, స్థానికులు, చిన్నారులు ఆత్మీయ స్వాగతం పలికారు.