అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కుంటిమద్ది వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో సోమశేఖర్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన తనని ఆదివారం రాత్రి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.