రాయదుర్గం: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కి బుద్ధి చెప్పండి: పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప
రాయదుర్గం పట్టణంలోని 1,2,3 వార్డులలో మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప, పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పర్యటించారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. జగన్ ప్రభుత్వంలోనే బాగుండేదని ప్రజలు చెబుతున్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, పొరాళ్ల శివ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.