KVBపురం: రోడ్డెక్కిన ఐదు గ్రామాల ప్రజలు కేవీబీపురం(M) పూడి, ఎగువపూడి గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచి స్థానికులు నిరసనలు చేపట్టారు. స్థానిక TDP నాయకుల అండదండలతో అధికారులు కుమ్మకై క్వారీకి అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ ఐదు గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామాల్లోకి భారీ యంత్రాలు రావడంతో వారు అడ్డకున్నారు. స్థానికంగా ఉన్న ఓ TDP నాయకుడి కనుసన్నల్లో ఇదంతా జరుగుతుందని వారు మండిపడ్డారు.