మంగళగిరి: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రత చర్యలపై సమీక్షించిన ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్
ఈ నెల 18 వ తేదీ నుండి జిల్లాలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీవీఐపీలు, వీఐపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ అధికారులు ప్రయాణ మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందని ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలోని అసెంబ్లీ హాల్ వద్ద వివిధ శాఖల అధికారులతో ఆరిఫ్ హఫీజ్ ఈ నెల 18 వ తేదీ నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు.