కోరుట్ల: మెట్పల్లి పట్టణంలోని పలు వార్డులలో డ్రైనేజీలలో తొలగించిన మున్సిపల్ కార్మికులు
మెట్పల్లి 'ప్రజలారా జర ఆలోచించండి మెట్పల్లి పట్టణంలోని పలు వార్డులలోని డ్రైనేజీలలో ప్లాస్టిక్ బాటిల్లు, కవర్లు, బొంతలు తదితర చెత్త వేయడం వలన కల్వర్టు కింద తట్టుకొని డ్రైనేజీ నీరు వర్షానికి రోడ్లపై నుంచి ప్రవహిస్తుంది. ఆ చెత్తను తొలగించడానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. పట్టణ ప్రజలు కాస్త ఆలోచించి డ్రైనేజీలలో ఎలాంటి చెత్తాచెదారాలను వేయకుండా చెత్తను మున్సిపల్ ఆటోలకు అందిస్తే మనకే మంచిది.