భీమిలి: తర్లవాడలో ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలన చేసిన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది
తర్లవాడ గ్రామంలో రైతు సాధికార సంస్థ తరపున రాయుడు ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే లాభాలు, 365 రోజుల సాగు విధానం ద్వారా అధిక దిగుబడులు సాధ్యమని రైతులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చక్రవర్తి, మోడల్ మేకర్ రామారావు వేసిన ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్స్‌ను పరిశీలించారు. మోడల్స్‌లో వేసిన పంటల వివరాలు, మార్కెటింగ్ విధానం గురించి తెలుసుకున్నారు. విశాఖ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్ రావు, జిల్లా మోడల్ మండల అధికారి గణేష్‌తో పాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.