బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ కొత్తగా ఏర్పడింది. బుద్దే శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కలిశారు. నూతన టీంకు శాలువాలు కప్పి ఆశీర్వదించిన ఈటెల పార్టీ బలోపేతం కోసం 24 గంటలు పనిచేయాలని సూచించారు. రాబోయే స్థానిక, గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.