పూతలపట్టు: మన్నారు పల్లి హౌసింగ్ కాలనీలో మూడు లక్షల ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే
పూతలపట్టు మండలంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం పి.కొత్తకోట పంచాయతీ మన్నారుపల్లి హౌసింగ్ కాలనీ నందు 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేనూతనపల్లి పంచాయతీ కొత్తూరు హరిజనవాడలో రూ.11 లక్షల వ్యయంతో మంజూరైన సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.