మార్కాపురం: మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలిసిన జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామి అమ్మవారికి అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ్ శర్మ ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనెల 5వ తేదీ జ్వాలాతోరణం కోటి దీపోత్సవం ఉంటుందన్నారు