శ్రీకాకుళం: కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బలవంతపు భూసేకరణ ఆపాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బలవంతపు భూసేకరణ కు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మందస మండలం బహాడపల్లి గ్రామంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ మాట్లాడుతూ... భూ సేకరణ పేరుతో కూటమి ప్రభుత్వం విలువైన భూములను సేకరించే ప్రక్రియ వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్మల్ విద్యుత్ ప్లాంట్ పేరుతో సరుబుజ్జిలి మండలం పరిధిలో 2000 ఎకరాలు భూసేకరణ తక్షణమే నిలుపుదల చేయాలని గుర్తు చేశారు. లేనిపక్షంలో పోరాటం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.