పూతలపట్టు: కాణిపాకం ఆలయ ప్రాంగణంలో వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్
పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శనివారం స్వర్ణాంధ్ర - స్వఛ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ ప్రత్యేకంగా పాల్గొని దేవతా వృక్షాలను నాటి నీరుపోశారు. అనంతరం ప్రజలకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రత కోసం కృషి చేయాలని, స్వచ్ఛమైన వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు అందరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.