కోడుమూరు: కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా భగవాన్ సత్యసాయి 100వ జయంతి వేడుకలు
కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం భగవాన్ సత్యసాయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాముడు ఆధ్వర్యంలో సత్య సాయి చిత్రపటానికి పూజలు చేశారు. సేవా మార్గంలో సత్యసాయి నడయాడిన జీవితం అందరికీ ఆదర్శమని వక్తలు తెలిపారు. మానవసేవే మాధవసేవ అని నమ్మిన సత్య సాయి అనేక సేవా కార్యక్రమాలు అమలు చేశారని కొనియాడారు.