అనంతపురం నగరంలో స్మార్ట్ మీటర్లను తమ ఇండ్లకు బిగించవద్దని ప్రజలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని 49 వ డివిజన్ పరిధిలో స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వీటిని బిగించమని ఏ అధికారి ఆదేశించారో చెప్పాలని వచ్చిన వారిని ప్రశ్నించి బిగింపు చర్యలను పూర్తిగా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.